విశాఖ పోర్టులో 25వేల కేజీల డ్రగ్స్ కంటెయినర్ ను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల వేళ ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటంతో సంచలనంగా మారింది. ఈ మేరకు సంధ్య ఆక్వా కంపెనీ పేరిట కంటైనర్ డెలివరీ కాగా, ఆ కంపెనీ ఎండీ కూనం వీరభద్రరావు, సీఈవో కోటయ్య చౌదరికి బీజేపీ, టీడీపీ నేతలతో సంబంధాలున్నాయని వైసీపీ అరోపిస్తోంది. ఇదే సమయంలో వీరిద్దరికి వైసీపీతో లింకులున్నాయని విపక్షాల మాట.