ఏఐ టెక్నాలజీ వచ్చాక అసలు వీడియోకు ఆర్టిఫిషియల్ వీడియోకు తేడా గుర్తించడం కష్టంగా మారింది. ఈ క్రమంలో దీనికి చెక్ పెట్టేందుకు యూట్యూబ్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. యూజర్లు అసలైన కంటెంట్, ఏఐతో రూపొందించిన వీడియోకు మధ్య వ్యత్యాసాన్ని తెలపాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఏఐ ద్వారా ఏమైనా క్రియేట్ చేస్తే ఛానల్ నిర్వహిస్తున్న వ్యక్తులు వెల్లడించాలని, ఇందు కోసమే క్రియేటర్ స్టూడియోలో కొత్త టూల్ తీసుకొచ్చామంది