ఈ నెల 23న టీడీపీ వర్క్ షాప్ నిర్వహించనుంది. ఎన్నికల వ్యూహాలు, పోల్ మేనేజ్మెంట్ పై అభ్యర్థులకు ఈ వర్క్ షాప్ లో అవగాహన కల్పించనుంది. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరై నేతలకు సూచనలు చేయనున్నారు.