పవన్ కు వంగా గీత బంపరాఫర్..

ఎన్నికల వేళ పిఠాపురం రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం కావటంతో వైసీపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. తాజాగా వపన్ తాను పిఠాపురం నుంచి గెలవటం ఖాయం అని ధీమా వ్యక్తం చేసారు. వంగా గీత గతంలో పీఆర్పీ నుంచి గెలిచారని..గీత కూడా జనసేనలోకి రావాలని ఆహ్వానించారు. ఈ వ్యాఖ్యలపైన గీత స్పందించారు. పిఠాపురంలోని జనసేన ముఖ్య నేతలు వైసీపీలో చేరుతున్నారు.

 

పిఠాపురం రాజకీయం : పిఠాపురం కేంద్రంగా వైసీపీ ఆపరేషన్ జనసేన ప్రారంభించింది. తాజాగా పిఠాపురం నుంచి పోటీ గురించి స్పష్టత ఇచ్చిన పవన్ అక్కడి రాజకీయం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్ది వంగా గీతను తమ పార్టీలోకి ఆహ్వానించారు. ప్రస్తుతం వైసీపీ తరఫున పోటీ చేస్తున్న వంగ గీత.. 2009లో మన ద్వారానే(ప్రజారాజ్యం) రాజకీయాల్లోకి వచ్చారు. భవిష్యత్తులో ఆమె వైసీపీని వీడి జనసేనలోకి రావాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు. 2009 నుంచి పిఠాపురంలో పోటీ చేయమని చెబుతుండేవారు. అప్పట్లోనే పోటీ చేయాలని ఆలోచించానన్నారు. ఇప్పుడైనా నా గెలుపు కోసం పిఠాపురం తీసుకోలేదుని పవన్ వివరించారు.

 

వంగా గీత కీలక వ్యాఖ్యలు : కులాల మధ్య ఐక్యత ఉండాలని, కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని, కులాలన్నింటినీ కలుపుకొని వెళ్లాలని భావించా. ఈ రోజు అది సఫలీకృతం అవుతోందని పవన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల పైన గీత స్పందించారు. పవన్ వి దింపుకు కల్లెం ఆశలుగా పేర్కొన్నారు. పవన్ ను వైసీపీలోకి రమ్మంటే ఎలా ఉంటుందని వ్యాఖ్యానించారు. తనకు పిఠాపురంలో అన్ని వర్గాల ప్రజలు మద్దతిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో పిఠాపురం జనసేన నేతలను తమ వైపు తిప్పుకొనేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. 2019లో జనసేన అభ్యర్దిగా పిఠాపురం నుంచి పోటీ చేసిన మాకినీడు శేషుకుమారి ఈ రోజు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. మరి కొందరు నేతలు చేరుతున్నట్లు తెలుస్తోంది.

 

జనసేన నుంచి వైసీపీలో చేరికలు : పవన్ పిఠపురం నుంచి పోటీ పైన ప్రకటన సమయం నుంచి వైసీపీ అలర్ట్ అయింది. ఎలాగైనా పిఠాపురం సీటు గెలిచేందుకు వ్యూహాలు అమలు చేస్తోంది. టీడీపీ, జనసేన నేతల పైన ఫోకస్ చేసింది. వారిని పార్టీలోకి ఆహ్వానించేలా కీలక నేతలను రంగంలోకి దించింది. జనసేన నియోజకవర్గ ఇంఛార్జ్ ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారు. అదే విధంగా పవన్ పిఠాపురం నుంచే పోటీ చేస్తారా..బీజేపీ నేతలు కోరితే చివరి నిమిషంలో కాకినాడ నుంచి ఓంపీగా బరిలోకి దిగుతారా అనేది ఇంకా కొంత డైలమా కొనసాగుతోంది. పవన్ తాను పిఠాపురం నుంచే పోటీకి నిర్ణయించానని చెబుతున్నారు. దీంతో, పిఠాపురం కేంద్రంగా ఇప్పుడు జనసేన వర్సస్ వైసీపీ రాజకీయం ఉత్కంఠ పెంచుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *