తెలంగాణ నూతన గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈయన తమిళనాడుకు చెందిన వారు. కోయంబత్తూరు లోక్ సభ స్థానం నుంచి రెండు సార్లు బీజేపీ ఎంపీగా ఎన్నికయ్యారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ గానూ పని చేశారు. ఆల్ ఇండియా కాయర్ బోర్డు ఛైర్మన్ గా 2016-2019 సేవలందించారు. గతేడాది ఝార్ఖండ్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు తెలంగాణ గవర్నర్ గా, పుదుచ్చేరి ఇన్ ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా పని చేయనున్నారు.