రాబోయే ఎన్నికల్లో గెలుపు ఎన్డీయేదే అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రధాని మోదీకి అండగా ఉంటామని చెప్పడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారని చెప్పారు. చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన, బీజేపీలు నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రసంగిస్తూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని ప్రశంసిస్తూ, ఆకాశానికి ఎత్తేశారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు.