రెండో పెళ్లికి రెడీ అయిన మెగా డాటర్ నిహారిక..

కొణిదెల నిహారిక.. ఈ పేరు తెలియని వారంటూ ఉండరూ. ప్రముఖ నటుడు నాగబాబు కుమార్తె నిహారిక ఈ మధ్య వార్తల్లో తరచుగా కనిపిస్తోంది. తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడిపోయిన తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లిన నిహారిక ఇప్పుడిప్పుడే యూట్యూబ్ ఛానళ్లలో ఇంటర్వూలు ఇస్తూ డిప్రెషన్ నుంచి ఎలా కోలుకుందో చెప్పింది.

 

తాజాగా ఒక ఇంటర్వూలో తను రెండో పెళ్లి చేసుకుంటానని కుండ బద్దలు కొట్టింది. దీంతో నెటిజన్లు ఎవరా పెళ్లి కొడుకు అని గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. నిజానికి ఆ ఇంటర్వూలో తను రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపింది కానీ ఎవరిని చేసుకుంటుందో ఖచ్చితంగా చెప్పలేదు.

 

కానీ ఇక్కడ ఒక సెన్సేషనల్ న్యూస్ మాత్రం చెప్పింది. తను రెండో పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకుంటుందో చెప్పింది. తనకు పిల్లలంటే ఇష్టమని చెప్పింది. పెళ్లి వర్కౌట్ కాలేదు. కానీ పిల్లలు కనాలంటే పెళ్లి చేసుకోవాల్సిందే కదా.. అందుకే రెండో పెళ్లి చేసుకుంటా అని కుండబద్దలు కొట్టింది.

 

పెళ్లి అయితే చేసుకుంటాను కానీ ఎప్పుడనే విషయం చెప్పలేను అని నిహారిక పేర్కొంది. అయితే నెటిజన్లు మాత్రం నిహారిక రెండో పెళ్ళి చేసుకోవడంలో తప్పు లేదని వివాహం వర్కౌట్ కాకపోతే దానికి ఇద్దరి తప్పు ఉంటుందని ఏ ఒక్కరి వల్లనో వివాహం బంధం తెంచుకోరని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *