పిఠాపురం నుంచి తాను ఎన్నికల్లో పోటీ చేయట్లేదని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ స్పష్టం చేశారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా.. ‘అందరూ నా ట్విట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఎక్కడా ఎన్నికలు అనే పదాన్ని వాడలేదు. నేను పిఠాపురంలో చిత్రీకరించిన ప్రాజెక్టుతో ఓ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌లో పాల్గొంటున్నానని చెప్పాను.’ అని అన్నారు. కాగా, నిన్న ‘సడెన్ డిసిషన్.. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా.’ అని ట్విట్ చేశారు.