ఓ వ్యక్తి కిడ్నీ నుంచి ఏకంగా 418 వరకు రాళ్ల బయటపడ్డాయి. 60 ఏళ్ల వ్యక్తి కిడ్నీ దెబ్బతినడంతో సోమాజిగూడ ఏఐఎన్‌యూ ఆసుపత్రిలో చేరారు. అతనికి మూత్రపిండాల్లో పెద్ద సంఖ్యలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వైద్యుల బృందం పెర్క్యుటేనియస్ నెఫ్రోలితోటమీ (పీసీఎన్‌ఎల్) విధానంలో ఎలాంటి కోత లేకుండా శస్త్రచికిత్స చేశారు. దాదాపు 418 రాళ్లు బయటకు తీసినట్లు వైద్యులు తెలిపారు. సర్జరీకి దాదాపు 2గంటల సమయం పట్టిందని చెప్పారు.