తెలంగాణలో గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీల భర్తీపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ మరోసారి నిర్ణయం తీసుకోనుంది. గతంలో సిఫార్సు చేసిన కోదండరాం, మీర్ అమీర్ అలీ ఖాన్ పేర్లను మళ్లీ గవర్నర్‌కు పంపాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్తగా అభ్యర్థుల పేర్లను ప్రతిపాదిస్తూ, గవర్నర్‌కు పంపేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.