భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడికి అదనపు సమయం ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. బ్యాంకు తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, నేడు (మంగళవారం) సాయంత్రంలోగా కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ)కి వివరాలు వెల్లడించాల్సిందేనని ఆదేశించింది. బ్యాంకు అందించిన వివరాలను ఈ నెల 15న సాయంత్రం 5 గంటలలోగా తమ అధికారిక వెబ్సైట్లో బహిర్గతపరచాలని సూచించింది.