వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకే సీఎం రేవంత్‌రెడ్డి హడావుడిగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారని బీఆర్‌ఎస్ రాష్ట్ర నేత మన్నె క్రిశాంక్ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఓట్ల రాజకీయంతోనే ఎన్నికల కోడ్ రాకముందే పనులను ప్రారంభించారని చెప్పారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంలో భూముల కోసం గతంలో మంత్రిగా కేటీఆర్ విశేషంగా కృషి చేశారని గుర్తు చేశారు.