సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణ బిజెపి కార్యాలయంలో బిజెపి కార్యకర్తల ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి అభినందనలు పొందిన భారత చైతన్య యువజన పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ను శాలువాలతో సదాశిపేట పట్టణ బిజెపి ప్రెసిడెంట్ శ్రీనివాస్, బిజెపి సంగారెడ్డిజిల్లా వైస్ ప్రెసిడెంట్ ఓదెల మాణిక్ రావు మరియు బిజెపి కార్యకర్తలు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ తరుణంలో సంగారెడ్డి జిల్లా బిజెపి పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఓదెల మాణిక్ రావు మాట్లాడుతూ భారత దేశ ప్రధానమంత్రి కుటుంబములో ఒక సభ్యుడుగా న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్, జ్యోతి వివాహమునకు ప్రత్యేకంగా ప్రశంస పత్రం ద్వారా అభినందనలు తెలపడం ఎంతో ఆనందదాయకంగా ఉందని ఇలాంటి మంచి మనస్తత్వం గల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధాన మంత్రిగా ఉండడం మన అదృష్టం అని తెలియజేస్తూ యావత్ భారతదేశాన్ని తన కుటుంబం లాగా భావిస్తున్న మోడీ గారు ఈరోజు ప్రతి కుటుంబంలో ఒక పెద్ద అన్న లాగా ఉన్నాడని చెప్పుకోవడానికి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్, జ్యోతి గార్ల వివాహానికి అభినందనలు పంపిన ప్రశంసపత్రమే నిదర్శనమని గర్వంగా చెప్పుకోవచ్చు అని తెలియజేశారు. ఈ సందర్భంలో న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, హోమ్ మినిస్టర్ అమీషా గారు తనను ఎప్పుడూ ఒక కుటుంబ సభ్యున్నిగానే భావించి ఎలాంటి సమస్యనైనా తమ సమస్యగా భావించి మెదిలారని అందులో భాగంగా న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ , జ్యోతి గార్ల వివాహ ఆహ్వాన పత్రాన్ని గౌరవించి వధూవరులను ప్రత్యేకంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన ప్రశంస పత్రం ద్వారా సుఖ సంతోషాలతో జీవించాలని అభినందించడం ఎంతో ఆనందదాయకంగా ఉందని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో సదాశివపేట పట్టణ బిజెపి ప్రధాన కార్యదర్శి కూచిని సతీష్, బిజెపి కార్యవర్గము సభ్యులు వై భగవంతరావు అడ్వకేట్, సంగమేష్, లింగం యాదవ్, శ్రీనివాస్, మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.