‘కల్కి 2898 ఏడీ’ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి ‘కల్కి 2898 ఏడీ’. ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ మూవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఇటీవలే సలార్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్.. ఇప్పుడు కల్కి మూవీతో రికార్డులు క్రియేట్ చేయాలని చూస్తున్నాడు.

 

ఈ మూవీ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిప్స్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. ముఖ్యంగా గ్లింప్స్‌లో ప్రభాస్ మాస్ లుక్ హాలీవుడ్ రేంజ్‌లో ఉండటంతో అందరినీ ఆకట్టుకుంది.

 

సైన్స్, పురాణాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ అత్యంత భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది. కాగా ఇందులో భారీ తారాగణం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విలక్షణ నటుడు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, రానా, దీపికా పదుకొనే, దిశా పటానీ వంటి స్టార్ నటీ నటులు ఈ మూవీలో భాగం అవడంతో సినిమా ఏ రేంజ్‌లో ఉందబోతుందో అందరికీ బాగా అర్థం అవుతోంది.

 

ఈ మూవీ ఈ ఏడాది సమ్మర్‌కి రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఆల్మోస్ట్ ఈ మూవీ షూటింగ్ పూర్తి కావడానికి సమయం ఆసన్నమైందని తెలుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ అదిరిపోయే అప్డేట్‌ను అందించారు.

 

ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్‌ గురించి తాజా అప్డేట్‌లను మూవీ యూనిట్ తమ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ మేరకు కొన్ని ఫొటోలను వదిలారు. కల్కి 2898 ఏడీ మూవీలో మెయిన్ హీరోయిన్‌గా దీపికా పదుకొనే నటిస్తుండగా.. సెకండ్ హీరోయిన్‌గా దిశా పటానీ నటిస్తోంది.

 

అయితే తాజాగా డార్లింగ్ ప్రభాస్, దిశా పటానీ పై ఓ సాంగ్‌ను చిత్రీకరించడానికి మూవీ యూనిట్ ఇటలీకి వెళ్లింది. అక్కడ కల్కి అఫీషియల్ అకౌంట్‌లో అందుకు సంబంధించిన ఫొటోను పంచుకుంది. ‘‘ఎ డార్లింగ్ పిక్.. ఇటలీ డైరీస్.. ప్రభాస్ – దిశా పటానీ’’ అంటూ ఫొటోలను షేర్ చేశారు.

 

అక్కడ లొకేషన్లలో షూటింగ్ కోసం రెడీ అవుతున్న ప్రభాస్ – దిశా పటానీల ఫొటోలను పంచుకున్నారు. అందులో ప్రభాస్ చలికోటు ధరించి కనిపిస్తున్నాడు. అలాగే దిశా పటానీ కూడా చలికి వెచ్చని దుప్పటి లాంటి కోటు కప్పుకుని కనిపించింది. అయితే అది బీచ్ లోకేషన్ కావడంతో చలికి బాగా వణికిపోతున్నట్లు వాళ్లని చూస్తే అర్థం అవుతోంది.

 

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో ప్రభాస్‌ను చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. కాగా ఈ సినిమా మే 9న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *