మసకబారుతున్న కేసీఆర్ ప్రాభవం… తాజా బీఎస్పీ పొత్తుతో ఆసక్తికర చర్చ…!

తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లపాటు అధికారాన్ని కొనసాగించి, ఒక వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీ ప్రాభవం మసకబారుతోందా? దేశ రాజకీయాలు చేస్తామని చెప్పి దేశ్ కి నేత అని పిలిపించుకున్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను చేయలేకపోతున్నారా? ఒకప్పుడు ఏఎస్పీ లేదు బిఎస్పి లేదు అంటూ మాట్లాడిన కెసిఆర్ లోక్సభ ఎన్నికలకు ముందు పెట్టుకున్న పొత్తు బీఆర్ఎస్ పార్టీ స్థాయిని మరింత కిందికి నెట్టిందా? అంటే అవును అనే అంటున్నారు తెలంగాణవాసులు.

 

తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ అధికారంలో ఉన్న సమయంలో ఏ పార్టీని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇక bspని, ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఆయన గుర్తించింది లేదు. ఒకానొక సందర్భంలో ఏ ఎస్ పి.. బిఎస్పినా.. ఏదీ లేదు అది కూడా ఒక పార్టీ నేనా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఆయనెవరు ఎట్లా ఉంటాడు? అని ప్రశ్నిం చారు కేసీఆర్.

 

రాజకీయాల్లో ఆయారాం గయారాంలు చాలామంది వచ్చి పోతుంటారు అని గత ఎన్నికలకు ముందు వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్, ఇప్పుడు అదే బిఎస్పి తో పొత్తు పెట్టుకున్నారు. ప్రవీణ్ కుమార్ ని తిట్టి మూడు నెలలైనా కాకముందే bsp తో పొత్తుకు రెడీ అయ్యారు. దీంతో కేసీఆర్ పని అయిపోయిందని, దేశ్ కి నేత రాష్ట్ర రాజకీయాలు చేయలేకపోతున్నారని, చివరకు బిఎస్పి తో కూడా పొత్తుకు కెసిఆర్ సిద్ధమయ్యారని అనుకుంటున్నారు.

 

ఈ పొత్తుతో కెసిఆర్ అనవసరంగా పార్టీ ప్రతిష్టను మరింత దిగజార్చుకున్నారని చర్చిస్తున్నారు. బీఎస్పీతో పొత్తు ప్రకటన తర్వాత చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ లో చేరేందుకు ఉత్సాహం చూపించడం రాజకీయాలలో కేసీఆర్ పని అయిపోయింది అన్న భావనకు ఊతమిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారాన్ని పోగొట్టుకున్న కేసీఆర్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీపై పైచేయి సాధించడానికి ఎంత ప్రయత్నం చేసినా ఇప్పటివరకు అది సాధ్యంకాలేదు.

 

ఇక లోక్ సభ ఎన్నికలలో అయినా సత్తా చాటి అత్యధిక సీట్లు సాధించాలని, లోక్సభ ఎన్నికల ఫలితాలు మళ్లీ బి ఆర్ ఎస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తాయని ఆశ పడుతున్నారు కేసీఆర్.ఈ క్రమంలోనే తమతో కలిసి ముందుకు సాగుతామన్న బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ అది ఒక్కసారిగా కెసిఆర్ ఇమేజ్ ను, బీఆర్ఎస్ పార్టీ ప్రాభవాన్ని దెబ్బతీసింది అన్న చర్చ జరుగుతుంది. అసలే బోరుకొచ్చిన కారుపై ఏనుగును ఎక్కించుకుంటే కష్టమే అన్న సెటైర్లు పేలుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *