ఎమ్మెల్సీగా కోదండరామ్ నియామకంపై హైకోర్టు సంచలన తీర్పు..!

తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం పై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రభుత్వం తాజాగా ఇద్దరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌నియమిస్తూ జారీ చేసిన గెజిట్ ను హైకోర్టు కొట్టి వేసింది. వీరి నియామకంపై ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాలని ధర్మాసనం సూచించింది. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ నియామకంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది,

 

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై ప్రభుత్వానికి చుక్కెదురైంది. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామకాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. ఈ సందర్భంగా కోదండరామ్‌, అలీఖాన్‌ల నియామకాన్ని హైకోర్టు కొట్టివేసింది. మంత్రిమండలి నిర్ణయానికి గవర్నర్‌ కట్టుబడి ఉండాలని న్యాయస్థానం సూచించింది. ఎమ్మెల్సీల నియామకంపై ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌లను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగానియమించడంపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పలు దఫాలుగా విచారణ అనంతరం హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ.. సిఫార్సుల తిరస్కరణలో గవర్నర్ తమిళిసై తీరును హైకోర్టు తప్పు పట్టింది. వీరి ఎన్నికను పున:పరిశీలించాలని గవర్నర్‌ను కోర్టు ఆదేశించింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల జాబితాను మరోసారి కేబినెట్ ముందు ఉంచి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఆర్టికల్ 171 ప్రకారం కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆపడానికి వీల్లేద‌ని హైకోర్టు దృష్టికి పిటిషనర్ తరుపు న్యాయవాదులు తీసుకెళ్లారు. మంత్రి మండలి నిర్ణయాలకు గవర్నర్‌ కట్టుబడి ఉండాల్సిదేనని హైకోర్టు సూచించింది. అభ్యంతరాలు ఉంటే కేబినెట్ కు తిప్పి పంపాలని..తిరస్కరించరాదని హైకోర్టు సూచించింది. ఇక, ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం పై ప్రభుత్వం ఏం చేస్తుందనేది వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *