వేసవి కాలం రాగానే పిల్లలు ఒంటి పూట బడుల కోసం వేయిట్ చేస్తూ ఉంటారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఒంటి పూట బడులపై కీలక నిర్ణయం తీసుకుంది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 15 నుంచి అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో ఒంటి పూట బడులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
ఈ ఒంటి పూట బడులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు వరకు నిర్వహించాలని పేర్కొంది. మధ్యాహ్న భోజనం పెట్టిన అనంతరం ఇళ్లకు పంపించాలని సూచించింది. పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి ఎస్ఎస్సీ బోర్డు హాల్ టికెట్లు విడుదల చేసింది. ఈ పదో తరగతి పరీక్షలు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు నిర్వహించనున్నారు.
పదో తరగతి పరీక్షల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షల కోసం 2,700 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతోన్నాయి. ఇంటర్ పరీక్షల తర్వాత పదో తరగతి పరీక్షలు ఆ తర్వాత 6, 7,8, 9 పరీక్షలు నిర్వహించి పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నారు. అటు ఏపీలో మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పదో తరగతి సంబంధించి హాల్ టికెట్లను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.
https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ కు వెళ్లాలి. మెయిన్ పేజీలో AP SSC Hall Tickets 2024 డౌన్‌లోడ్ లింక్ పై క్లిక్ చేయాలి. మీ వివరాలు నమోదు చేసి, సబ్మిట్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత హాల్ టికెట్ డౌన్ లోడ్ తీసుకోవచ్చు. తెలంగాణ పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు కూడా ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచారు. https://bse.telangana.gov.in/ వెబ్ సైట్ కు వెళ్లారు. SSC Examinsation March-2024 పై క్లిక్ చేయాలి. వివరాలు నమోదు చేసి సడ్మిట్ కొట్టాలు. ఆ తర్వాత హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవాలి.