న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ వివాహ వేడుకలకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ..

 

సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణంలో స్థానిక కార్యాలయంలో న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ వివాహ వేడుకలకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రశంస పత్రాన్ని దృష్టిలో ఉంచుకొని పలు ప్రాంతాల నాయకులు ,యూనియన్ లీడర్లు,జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ప్రత్యేకంగా భారత చైతన్య యువజన పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసిన న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ కు శాలువాలతో ఘనంగా సత్కరించి నరేంద్ర మోడీ గారి అభినందనలు పొందిన వ్యక్తిగా అభినందనలు తెలియజేశారు. తదననంతరం వికారాబాద్ జిల్లా,మోమిన్ పెట్ మండలం బిజెపి కార్యదర్శి రాఘవ రెడ్డి గారు మాట్లాడుతూ భారతదేశ ప్రధానమంత్రి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ వివాహ వేడుకలను దృష్టిలో ఉంచుకొని అభినందిస్తూ ప్రత్యేకంగా ప్రశంస పత్రాన్ని పంపించడం చాలా ఆనందించదగ్గ విషయమని అందుకు ఈరోజు అందరం గర్వపడుతున్నామని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని

భారత చైతన్య యువజన పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసిన న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ఫిబ్రవరి 14, 2024 నాడు వివాహమునకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హాజరు అగుటకు సమయం లేనందున స్వయంగా ప్రధానమంత్రి గారు స్వాతంత్ర సమరయోధుడు కీర్తిశేషులు కోవూరి మొగులయ్య గౌడ్ సతీమణి కోవూరి మాణమ్మ గారి కుటుంబాన్ని గౌరవించి ప్రత్యేకంగా నూతన వధువరులు న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ , జ్యోతి గార్లను ఆశీర్వదిస్తూ సుఖ సంతోషాలతో జీవించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాతపూర్వకంగా లేఖను పంపించడం ఎంతో ఆనందదాయకంగా ఉందని భారత చైతన్య యువజన పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసిన న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ సతీమణి జ్యోతి మరియు స్వాతంత్ర సమరయోధుని కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా మోడీ గారికి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా ఫిబ్రవరి 14 వివాహ వేడుకల్లో పాల్గొన్న గ్రామ నాయకులకు, మండల నాయకులకు, నియోజకవర్గ నాయకులకు, జిల్లా నాయకులకు, తెలంగాణ రాష్ట్ర నాయకులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో అఖిలభారత క్షత్రియ మహాసభ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఠాకూర్ ప్రభు సింగ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మణ్, కరాటే మాస్టర్ & ఆర్ఎస్ఎస్ కార్యకర్త అశోక్, బీసీవై పార్టీ జిల్లా నాయకులు ఎర్ర విగ్నేష్ గౌడ్, ఆర్ఎంపీ డాక్టర్ గోపాల్ నేత, ఆర్టీసీ కంట్రోలర్ మల్లేశం గౌడ్, జిల్లా బీసీ నాయకులు జి శంకర్ గౌడ్ మరియు ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *