జిల్లావ్యాప్తంగా భారీ వడగండ్ల వాన కురిసింది, మానకొండూర్,శంకరపట్నం, గంగాధర,కొత్తపల్లి రూరల్,చిగురుమామిడి, బెజ్జంకి, గన్నేరువరం మండలాల్లోని పలు గ్రామాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది గన్నేరువరం మండలంలోని మైలారం,సాంబయ్యపల్లి, మరియు మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో రాళ్లతో కూడిన వర్షం కారణంగా మండలాలలో పాటు జిల్లావ్యాప్తంగా రైతులు పూర్తిగా నష్టపోయారు
ఈదురుగాలులతో వచ్చిన వడగండ్ల వానకు మామిడి కాయలు నెల రాలాయి,చెట్టు నెల కూలిపోయాయి ,కోతకు వచ్చిన వరి ధాన్యం రాలిపోయింది ,టమాటో,మిర్చి, పంటలు పూర్తిగా దెబ్బతిందని రైతులు బాధను మీడియా తో చెప్పుకొన్నారు, ఒక్కసారిగా వచ్చిన అకాల వర్షానికి అన్నదాతలు అతలాకుతలం ఆయారు చేతికొచ్చిన పంట నేలపాలవడంతో రైతున్నలు కన్నీరుమున్నీరయ్యరు నష్టపోయిన రైతులను ప్రభుత్వ అధికారులు పంటలను పరిశీలించి తమకు మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు
గన్నేరువరం మండలకేంద్రంలో అయితే ఐకేపీ సెంటర్ లో తాటిపత్రి లేక రైతులు అవస్థలు పడుతున్నారు వరి ధాన్యం తడిసి పోయి ధాన్యాని ఆరబెట్టారు రైతు బోయిని కొమురయ్య మాట్లాడుతూ ఐకేపీ సెంటర్ ప్రారంభం అయి వారం రోజులు ఆయన కూడా కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు
