బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా రంగాల్లో ఏటా 10 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఇందుకు సంబంధించి నైపుణ్య శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన మేరకు హైదరాబాద్‌లో స్కిల్ వర్సిటీ ఏర్పాటు విషయమై గురువారం అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగే సమావేశంలో చర్చించి విధివిధానాలు ఖరారుచేస్తామన్నారు. స్కిల్ వర్సిటీని ఉమ్మడి జిల్లాలకూ విస్తరిస్తామని చెప్పారు.