అల్వాల్ పోలీస్ స్టేషన్ లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఎల్అర్ఎస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అల్వాల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నా నేపథ్యంలో రాజశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. తన వాహనాన్ని అడ్డుకున్నారని, విధులకు ఆటంకం కలిగించారని శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.