ఈ నెల 11న భద్రాచలంలో ప్రారంభించే ఇందిరమ్మ ఇల్లు పథకంపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. ఈ పథకం కింద తొలి దశలో సొంత స్థలం ఉన్న వారికే రూ. 5లక్షలు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఏడాది 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేస్తామని, ఆయా ఇళ్లను మహిళల పేరు మీదే ఇస్తామన్నారు. పథకాన్ని హౌసింగ్ కార్పొరేషన్, జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షిస్తారని చెప్పారు.