ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్న సీఎం.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 5,278 మందికి నియామక పత్రాలను అందజేయనున్నారు. హైదరాబాద్ లోని LB స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. గురుకులాల్లో డీఎల్, జేఎల్, టీజీటీలుగా 4,638 మంది, పోలీసుశాఖలో 565 మందితో పాటు TSPSC పరిధిలో ఫిజియోథెరపిస్టులు-41, డ్రగ్ ఇన్స్పెక్టర్లు-16, అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు-9, గురుకుల ప్రిన్సిపాళ్లు-9 కలిపి మొత్తం 75 మంది ఉద్యోగులు నియామక పత్రాలను అందుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *