ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. గ్యాలరిస్ట్ నికోలాయి సచ్దేవ్ తో ముంబైలో నిన్న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఉంగరాలు మార్చుకున్నారు. 14 ఏళ్ల నుంచి ఇద్దరికీ పరిచయముంది. అలా పరిచయం కాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. ఏదేమైనా 38 ఏళ్ల వయసులో వరలక్ష్మి పెళ్లి చేసుకోనుంది.