తెలంగాణలో దివ్యాంగులకు ఉద్యోగాల్లో 4 శాతం, విద్యావకాశాల్లో 5 శాతం, అన్ని సంక్షేమ పథకాల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఫైల్ ను సిద్ధం చేసి పంపించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ట్రాన్స్ జెండర్లకు ప్రభుత్వ పథకాలన్నీ వర్తించేలా, వారికి సరైన అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక విధానాన్ని తయారు చేయాల్సి ఉందని సీఎం స్పష్టం చేశారు