రాడిసన్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడు క్రిష్ శుక్రవారం పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఇటీవల ఆయనకు గచ్చిబౌలి పోలీసులు నోటిసులు పంపించిన విషయం తెలిసిందే. అయితే తాను ముంబైలో ఉన్నానని పోలీసులు ఎప్పుడు పిలిచినా వస్తానని ప్రకటించారు. దీంతో పోలీసులకు డ్రగ్స్ టెస్ట్ కోసం ఆయన నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. పాజిటివ్‌గా తేలితే అరెస్టు చేసే అవకాశం ఉంది.