హైదరాబాద్ నగరాన్ని స్కార్లెట్ ఫీవర్ వణికిస్తుంది. చిన్న పిల్లల ఆసుపత్రిలో ఈ ఫీవర్ బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. జ్వరంతో ఆసుపత్రులకు వచ్చే 20 మంది చిన్నారుల్లో 10-12 మందికి ఈ స్కార్లెట్ ఫీవర్ లక్షణాలు ఉన్నాయి.102 డిగ్రీల జ్వరం, హఠాత్తుగా గొంతు నొప్పి, తలనొప్పి, వికారం, వాంతులు, కడుపు నొప్పి, శరీరం దద్దర్లు, నాలుక స్ట్రాబెర్రీ రంగులోకి మారడం, గొంతు, నాలుకపై తెల్లటి పూత ఇవే ఈ వ్యాధి లక్షణాలు.