కాసేపట్లో తెలంగాణ సచివాలయంలో ధరణి కమిటీతో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష చేయనున్నారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, మైనింగ్, రవాణా శాఖల రాబడులపై సమీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే రెవెన్యూ సంబంధిత శాఖల అధికారులతో కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. ధరణి పోర్టల్ సృష్టించిన సమస్యలపై సమగ్ర అధ్యయనం చేసింది.