తెలంగాణలోని గ్యాస్ డీలర్లు రూ.500కే సిలిండర్ పథకం అమలుకు సిద్ధం కావాలని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో 1.20 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో రేషన్ కార్డు ఉన్నవారి సంఖ్య 89.99 లక్షలు. ప్రాథమిక అంచనా ప్రకారం.. 39.50 లక్షల మంది సబ్సిడీ గ్యాస్ పథకానికి అర్హులుగా గుర్తించినట్లు తెలుస్తోంది.