బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ తెలుగులో వరుస సినిమా అవకాశాలు అందుకుంటోంది. తెలుగులో ఎంట్రీ సినిమానే అగ్ర కథానాయకుడు జూ. ఎన్టీఆర్ తో ‘దేవర’ మూవీ చేస్తోంది. ఇదిలా ఉండగా మరో అగ్ర హీరో రామ్‌చరణ్ సరసన ‘ఆర్సి16’లో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ క్రమంలో తన తల్లిని ఆదరించినట్లే తెలుగు ప్రేక్షకులు తనపై ప్రేమాభిమానాలు చూపిస్తారనే నమ్మకంతో ఉందట. ఈ నేపథ్యంలోనే తెలుగు భాషలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు కూడా తెలిపింది జాన్వీ.