మహర్షి సక్సెస్ మీట్

Image result for mharshi press meet

మహేశ్ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేశ్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం మహర్షి. గురువారం రిలీజైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి విశేష స్పందన వస్తున్నట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ సందర్భంగా సినిమా సక్సెస్ మీట్ ను చిత్రబృందం ఏర్పాటు చేసింది. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, మహేశ్ బాబు కెరీర్ లోనే ఒక ల్యాండ్ మార్క్ మూవీ అవుతుందని అన్నారు. ఈ వేసవిలో వచ్చిన మహర్షి చిత్రం తెలుగులో నంబర్ వన్ గ్రాసర్ అవుతుందని, ఇది ఎంతో ఎక్స్ పీరియన్స్ తో చెబుతున్న మాట అని తెలిపారు.

అయితే, అన్ని పెద్ద సినిమాల్లాగే మహర్షి చిత్రానికి కూడా ఫస్టాఫ్ బాగుంది, సెకండాఫ్ డల్ అయింది అంటూ కామెంట్లు వచ్చాయని, కానీ, ఫైనల్ గా అభిమానులు ఏం ఫీలయ్యారన్నదే పాయింట్ అని స్పష్టం చేశారు. చివరి అరగంట సినిమా అద్భుతంగా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయని, అలాంటప్పుడు ఓవరాల్ గా సినిమా ఎలా ఉందన్న విషయమే ముఖ్యమని అన్నారు. ఇకనుంచి మహర్షి చిత్రానికి ఫస్టాఫ్, సెకండాఫ్ ఏమీ ఉండవని, ఈ చిత్రం మరో స్థాయికి వెళుతుందని ఆత్మవిశ్వాసంతో చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *