బాలికలకు గర్భాశయ క్యాన్సర్‌ వ్యాక్సిన్‌.. కేంద్రం కీలక ప్రకటన..!

దేశంలో క్యాన్సర్‌ కేసులు పెరగడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తన బడ్జెట్‌ ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌ను ఎదుర్కొనేందకు కేంద్రం వ్యాక్సినేషన్‌ ప్రారంభించేందుకు సిద్ధమవుతోందని తెలిపారు. దేశంలోని 9–14 ఏళ్ల బాలికలకు హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్‌ టీకా ప్రచారాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. సర్వైకల్‌ క్యాన్సర్‌ను అడ్డుకోవడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఇమ్యూనైజేషన్‌ డ్రైవ్‌ చేపడతామని తెలిపారు. మూడు దశల్లో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *