తెలంగాణలోని ప్రతి మండలంలో ఇంటర్ నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. స్కూల్స్ ఏర్పాటుకు కావాల్సిన భూములను గుర్తించాలని అధికారులకు అదేశించారు. విద్యా బోధన, వసతుల కల్పనపై విద్య శాఖ ఆధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. బుధవారం సచివాలయంలో 2024-25 వార్షిక బడ్జెట్‌కు సంబంధించి విద్య శాఖ ప్రతిపాదనలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి అధికారులతో సమీక్షించారు.