సుకుమార్ శిష్యులలో ఒకరొకరుగా మెగాఫోన్ పడుతూ వస్తున్నారు. ఆ జాబితాలో మనకి బుచ్చిబాబు కూడా కనిపిస్తాడు. ఆయన నుంచి వచ్చిన ‘ఉప్పెన’ సినిమా 100 కోట్లను వసూలు చేసింది. చాలా కాలం తరువాత ఈ ప్రేమకథా చిత్రం యూత్ ను ఒక ఊపు ఊపేసింది. ఆ తరువాత స్టార్ హీరోలతో బుచ్చిబాబు వరుస సినిమాలను లైన్లో పెడతాడని అంతా అనుకున్నారు .. కానీ అలా జరగలేదు.
ముందుగా ఎన్టీఆర్ తో బుచ్చిబాబు సినిమా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ చివరికి చరణ్ తో ప్రాజెక్టు ఓకే అయింది. ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని కూడా జరుపుకుంది. సుకుమార్ తన సినిమాలకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కి ఎక్కువ సమయం తీసుకుంటాడు. అలాగే బుచ్చిబాబు కూడా తన సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చేస్తూ వచ్చాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
ప్రస్తుతం చరణ్ తన 15వ సినిమాను శంకర్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఆ తరువాత ఆయన బుచ్చిబాబుతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడని అంటున్నారు. చరణ్ కి ఇది 16వ సినిమా అవుతుంది. గతంలో ‘రంగస్థలం’ కోసం విలేజ్ సెట్ వేసిన ప్రదేశంలోనే, ఈ సినిమా కోసం ఒక భారీ సెట్ వేస్తున్నారని సమాచారం. సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ ఇక్కడే జరుగుతుందని అంటున్నారు. రెహ్మాన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తూ ఉండటం విశేషం