విజయనగరం కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి వైఎస్ షర్మిల హాజరయ్యారు. ఈ సమావేశంలో షర్మిల మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్ర అభివృద్ధి మరోలా ఉండేది. ప్రత్యేక హోదా సాధించడంలో టీడీపీ, వైసీపీ విఫలం అయ్యాయి. ఇక జగన్ అన్న ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 25 ఎంపీలు ఇస్తే.. హోదా తెస్తా అన్నారు. అధికారంలోకి వచ్చాక స్వలాభం కోసం చూశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే.. ఎన్నో పరిశ్రమలు వచ్చేవని షర్మిల అన్నారు.