కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేస్తారని ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత విజయశాంతి ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. దళితులకు 3 ఎకరాలు, దళితబంధు, దళిత సీఎం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ఇంకా ఎన్నో లెక్కకు చెప్పలేనన్ని మోసపు హామీలతో బీఆర్ఎస్ 10 ఏండ్లు ప్రజలను మోసగించిందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఏండ్ల కన్నా నిలవదని మాట్లాడటం దుర్మార్గం.. దురహంకారం అని విమర్శించారు.