ఈ నెలాఖరు నుంచి జ‌న‌సేనాని ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌లు..

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఈ నెలాఖరు నుంచి జ‌న‌సేనాని ప‌వ‌న్ కల్యాణ్‌ క్షేత్రస్థాయి పర్యటనలు, బహిరంగ సభలు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ఆదివారం మంగళగిరిలో వెల్లడించారు. పవన్ రోజుకు మూడు సభల్లో పాల్గొంటార‌ని తెలిపారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో బహిరంగ సభలు ఏర్పాటుచేసేలా ప్రణాళిక రూపొందించామ‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *