అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇన్నాళ్లు తాత్కాలిక మందిరంలో పూజలందుకున్న పాత విగ్రహాన్ని ఇవాళ అలరించి పూజించారు. కొత్త విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ పూర్తయ్యేవరకు పాత విగ్రహమే పూజలు అందుకుంటుందని వీహెచ్‌పీ ప్రతినిధి శరద్ శర్మ చెప్పారు. అయితే ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మొదలవుతోంది.