మేడిగడ్డ బ్యారేజీ పియర్స్ అంచనాకు మించి దెబ్బతిన్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వర్గాలు చెబుతున్నాయి. ఏడో బ్లాక్ తో పాటు 6, 8 బ్లాక్‌లలో కూడా మరిన్ని పియర్స్‌కు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నాయి. బ్యారేజీ డిజైన్, నాణ్యత, నిర్వహణలో లోపాలను గుర్తించినట్లు తెలుస్తోంది. బ్యారేజీ కుంగడం అకస్మాత్తుగా జరిగింది కాదని, రెండు మూడేళ్ల క్రితం నుంచే సమస్య ప్రారంభమైందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.