ప్రభుత్వంతో చర్చలు సఫలం.. సమ్మె విరమించిన మున్సిపల్ కార్మికులు….

ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించారు. బుధవారం సాయంత్రం కార్మిక సంఘాలతో మంత్రి వర్గం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో గత రెండు వారాల నుంచి చేస్తున్న సమ్మె విరమిస్తున్నట్లు మున్సిపల్ కార్మికులు తెలిపారు. రేపటి నుండి మున్సిపల్ కార్మికులు యధావిధిగా విధులకు హాజరు కానున్నారని మున్సిపల్ కార్మికుల సంఘం తెలిపింది.

 

గతంలో ఒకసారి మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. అయితే కొన్ని విషయాలపై సృష్టత రాలేదు. దీంతో మరోసారి ప్రభుత్వం‌తో మున్సిపల్ కార్మిక సంఘాలు చర్చలు జరిపారు. తాజాగా జరిగిన చర్చలు సఫలం అవ్వడంతో కార్మికులు సమ్మె విరమించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *