తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలయింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభం అవుతుంది. ఇంటర్ రెండో సంవత్సరం ఫిబ్రవరి 29 నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అంటే మూడు గంటల పాటు నిర్వహిస్తారు.
ఇంటర్ మొదటి సంవత్సరం వారికి ఫిబ్రవరి 28న మొదటి లాగ్వేజ్ పేపర్ ఉంటుంది. మార్చి 1న ఇంగ్లీష్, మార్చి 4న ఎంపీసీ వారికి మ్యాథ్య్ -1ఏ, బైపీసీ వారికి బాట్ని పేపర్-1, మార్చి 6న ఎంపీసీ వారికి మ్యాథ్స్-1బీ, బైపీసీ వారికి జూలాజీ పేపర్-1, మార్చి 11న ఫిజిక్స్ పేపర్-1, మార్చి 13న కెమిస్ట్రీ పేపర్-1 పరీక్షలు ఉంటాయి. ఫిబ్రవరి 29న లాగ్వేజ్, మార్చి2న ఇంగ్లీష్, 5న ఎంపీసీ వారికి మ్యాథ్య్ పేపర్-2ఏ, బైపీసీ వారికి బాట్ని పేపర్-2, మార్చి 7 ఎంపీసీ వారికి మ్యాథ్స్-2బీ, బైపీసీ వారికి జూలాజీ పేపర్-2 , 12న ఫిజిక్స్-2, 14న కెమిస్ట్రీ-2 పరీక్షలు జరగనున్నాయి.
ఎంపీస్, బైపీసీ మొదటి సంవత్సరం మార్చి 13 న పరీక్షలు ముగుస్తాయి. బైపీసీ, ఎంపీసీ రెండో సంవత్సరం మార్చి 14న పరీక్షలు ముగుస్తాయి. సీఈసీ, హెచ్ఈసీ, బ్రిడ్జ్ కోర్సుల వారికి మార్చి మార్చి 19 పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. రెండో శనివారం, ఆదివారాల్లోనూ ఈ పరీక్షలు జరుగుతాయని అధికారులు తెలిపారు. రెండు సెషన్లలో ప్రాక్టికల్స్ జరుగుతాయని వెల్లడించారు.
ప్రాక్టికల్స్ రెండు సెషన్లలో కొనసాగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష ఫిబ్రవరి 16న నిర్వహిస్తారు.