అయోధ్య సర్వం రామమయంగా మారింది. వీధుల్లో ఎక్కడ చూసినా రామనామమే వినిపిస్తున్నది. వచ్చే నెలలో ప్రారంభానికి అయోధ్యలోని రామమందిరం ముస్తాబవుతోన్న క్రమంలో సూర్యుని ఇతివృత్తంతో రూపొందించిన 40 సూర్య స్తంభాలను గుడికి చేరుకునే రోడ్డుకిరువైపులా ఏర్పాటు చేస్తున్నారు. 30 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేస్తున్న ఈ స్తంభాలపై అలంకారప్రాయంగా ఒక గోళాకారాన్ని ఉంచారు. రాత్రిపూట వెలిగించినప్పుడు సూర్యుని పోలి ఉంటుంది.