‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టైటిల్ లోగో ఇదే..

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్‌ చిత్రం ‘RRR’. ఈ సినిమాకు సంబంధించిన ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్‌ఆర్‌ఆర్‌ టైటిల్‌కు సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి టైటిల్‌ లోగో, మోషన్‌ పోస్టర్‌ ఉగాది కానుకగా బుధవారం చిత్రబృందం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈ చిత్రానికి ఆర్‌ఆర్‌ఆర్‌- ‘రౌద్రం  రణం రుధిరం’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. మోషన్‌ పోస్ట్‌ర్‌లో ఎన్టీఆర్‌ నీటిలో నుంచి, రామ్‌చరణ్‌ నిప్పులో నుంచి నడుచుకుంటూ వస్తున్న సన్నివేశాల్ని చూపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *