నిత్యావసర వస్తువులు సరఫరా చేసే వాహనాలకు పాసులు అందజేస్తారు

లాక్‌డౌన్‌ సందర్భంగా అతిముఖ్యమైన సేవలకు ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. నిత్యావసర వస్తువులు సరఫరా చేసే వాహనాలకు పాసులు అందజేస్తారు. పాసుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం covid19.hyd@gmail.com, వాట్సాప్‌ 9490616780 నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల స్టాఫ్‌, డయాగ్నస్టిక్‌ కేంద్రాల సిబ్బందికి ఐడీ కార్డులు చూపిస్తే పాసులిస్తారు. వంట గ్యాస్‌, మినరల్‌ వాటర్‌ సరఫరా చేసే వారిని నేరుగా అనుమతిస్తారు. నిత్యావసరాలను అందించే ఆయా సంస్థల అసోసియేషన్లతో నగర సీపీ అంజనీకుమార్‌ బుధవారం  నిర్వహించిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. సైబరాబాద్‌, రాచకొండ పరిధిలోనూ అత్యవసర సేవలందించే వాహనాలకు పాసులు జారీ చేస్తామని కమిషనర్లు సజ్జనార్‌, హేశ్‌భగవత్‌ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *