జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్ పార్టీ నేతలతో కీలక చర్చలు జరిపారు. రానున్న ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాల ఎంపికపై పీఏసీ సభ్యులు, పార్టీ కీలక నేతలతో పవన్ చర్చించారు. పోటీచేసే స్థానాల్లో ఇరుపక్షాల బలాబలాలపై పవన్ ఆరా తీశారు .రేపు, ఎల్లుండి కూడా చర్చలు కొనసాగే అవకాశం ఉంది. ఉభయగోదావరి జిల్లాలు, విశాఖ, కృష్ణ, గుంటూరు, తిరుపతి, అనంతపురం జిల్లాల నేతలతో చర్చలు జరిపారు. పోటీ చేయాలనుకుంటున్న స్థానాలపై త్వరలోనే ఓ నిర్ణయం తెలపనున్నారు.
ఇక ఏపీలో భారీ బహిరంగ సభలకు టీడీపీ, జనసేన పార్టీలు ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి. అయితే మూడు ప్రాంతాల్లో సభలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలో సభలు నిర్వహించే యోచనలో టీడీపీ జనసేన ఉన్నట్టు సమాచారం. అయితే మేనిఫెస్టో ప్రకటించిన తర్వాతనా లేక ముందా అనేది నిర్ణయించాల్సి ఉంది.