సమ్మెలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు తక్షణమే విధుల్లో చేరాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్న గ్రాట్యుటీ అంశం మా పరిధిలో లేదు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు కాలేదు. అలాంటప్పుడు మేం ఎలా చేస్తాం. రెండు మూడు నెలల్లో ఎన్నికలకు వెళుతున్నందున ఇప్పుడు జీతాలు పెంచలేం‘ అని స్పష్టం చేశారు.