తేది:13-04-2026 TSLAWNEWS రాయికల్ మండలం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.
జగిత్యాల జిల్లా: భూపతిపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతిమ వైద్యులు స్నేహ,గాయత్రి మొత్తం 123 మందికి కంటి పరీక్షలు నిర్వహించి,21 మందిని కరీంనగర్ నగునూరు ప్రతిమ ఆసుపత్రికి రిఫర్ చేశారు.రిఫర్ చేసిన వారికి మంగళవారం ఉచిత బస్సు సౌకర్యం కల్పించి,ప్రతిమ ఆసుపత్రిలో ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు ప్రతిమ ఫౌండేషన్ ఆర్గనైజర్ నాగిరెడ్డి రఘుపతి తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుర్రం భావన, మార్కెటింగ్ సిబ్బంది ప్రకాష్ రావు, శ్యామల,ఉపసర్పంచ్ మూగల సంజీవచారి,మాజీ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్,గ్రామీణ వైద్యులు జలంధర్,ప్రసాద్,వార్డు మెంబర్లు రాము,కొమురయ్య,శేఖర్,గంగారెడ్డి పాల్గొన్నారు.