తేది:13-04-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS జగిత్యాల రూరల్ రిపోర్టర్ జి. తిరుపతి.
జగిత్యాల జిల్లా: పదవ తరగతి వార్షిక పరీక్షల సందర్భంగా ఈరోజు చివరి పరీక్ష నేపథ్యంలో సోమవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల – పురానిపేట లోనిజిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు.
పరీక్షా కేంద్రంలో నిర్వహణ విధానం, ప్రశ్నపత్రాల భద్రత, హాల్ టికెట్ల పరిశీలన ప్రక్రియలను ప్రత్యేకంగా పరిశీలించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ:
విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.
పరీక్షా గదుల్లో వెలుతురు, తాగునీరు, శౌచాలయాల నిర్వహణ సక్రమంగా ఉన్నాయా అనే విషయాలను పరిశీలించారు.
విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. మొబైల్ ఫోన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కేంద్రంలోకి అనుమతించరాదని స్పష్టం చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ సక్రమంగా కొనసాగాలని సూచించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.
పరీక్షల సమయంలో పారదర్శకత, క్రమశిక్షణ పాటించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. పరీక్షలు నిబద్ధతతో, భాద్యతగా నిర్వహించాలని సూచించారు. ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
విద్యుత్ సరఫరా అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
పరీక్షలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
అదేవిధంగా సోమవారం నాటితో పదవ తరగతి పరీక్షలు పూర్తవుతున్నందున సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అందరు ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.
ఈ పరిశీలనలో జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, డి.ఈ. వో. కె. రాము , సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.