ఇరాన్ యుద్ధం మళ్లీ మొదటికి..! గ్యాస్ కష్టాలు మళ్లీ రెట్టింపు..?

ఇస్లామాబాద్ శాంతి చర్చలు విఫలం కావడంతో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. హ్మోర్మూజ్ జలసంధిని దిగ్బంధించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇరాన్‌కు పన్ను కట్టిన వస్తున్న నౌకలను అమెరికా నేవీ టీమ్స్ అడ్డుకోవడం అన్నమాట. ఈ నేపథ్యంలో ఆసియా దేశాల్లో మళ్లీ కొత్త టెన్షన్ మొదలైంది

ఇస్లామాబాద్ శాంతి చర్చలు ఫెయిల్ కావడంతో హోర్మూజ్ జలసంధి వద్ద కొత్త టెన్షన్ మొదలైంది. హ్మోర్మూజ్ జలసంధిని దిగ్బంధించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు ఇవ్వడంతో ఆసియా దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. గడిచిన రెండువారాలుగా రిలీఫ్ లభించిందన్న సమయంలో ట్రంప్ ప్రకటన పుండు మీద కారం జల్లినట్టుగా తయారైంది.

 

ఈ నేపథ్యంలో దేశంలో మళ్లీ ఆయిల్-గ్యాస్ కష్టాలు మళ్లీ రెట్టింపు కానున్నాయి. ప్రస్తుతం గ్రీన్ ఆశా నౌక ఇండియాకు రానుంది. అది మరో నాలుగైదు రోజుల్లో రావచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆ నౌకలోని గ్యాస్.. దేశవ్యాప్తంగా ఒక రోజుకు సరిపోతుందని తెలుస్తోంది. మిగతా 15 నౌకలు జలసంధి వద్ద చిక్కుకున్నాయి. అవి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది.

 

దేశంలో గ్యాస్ కష్టాలు మళ్లీ రెట్టింపు.. కేంద్రం కీలక నిర్ణయాలు

 

గల్ఫ్ దేశాల నుంచి కాకుండా రష్యా, అమెరికా, అర్జెంటీనా దేశాల నుంచి ఎల్పీజీ గ్యాస్ వచ్చే అవకాశాలు తక్కువ. దూరం ఎక్కువ కావడంతో ఖర్చు ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. 5 కేజీల LPG గ్యాస్ సిలిండర్ల సప్లైని పెంచాలన్నది అందులో కీలక నిర్ణయం. మరొకటి పైప్డ్ నేచురల్ గ్యాస్-PNG కనెక్షన్లను మరింత పెంచాలని నిర్ణయం తీసుకుంది.

 

గ్యాస్ సంక్షోభానికి ముందు అంటే ఫిబ్రవరిలో 5 కేజీల గ్యాస్ సిలెండర్ కేవలం 77 వేల వరకు అమ్మకాలు జరిగాయి. గడిచిన రెండు లేదా మూడువారాలుగా పరిశీలిస్తే వాటి అమ్మకాలు లక్ష దాటాయి. మార్చి 23 నుంచి ఇప్పటివరకు 13 లక్షలకు పైగానే 5 కేజీల గ్యాస్ సిలెండర్లు విక్రయించాయి ఆయిల్ కంపెనీలు. ఇప్పుడు రోజువారీ లక్ష వరకు అమ్ముడుపోతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

 

వీటిని వలస కార్మికులు, తక్కువ ఆదాయం కలవారు కొనుగోలు చేస్తున్నారు. ఇక పైప్డ్ నేచురల్ గ్యాస్-PNG విషయానికి వద్దాం. మార్చి నుంచి ఏప్రిల్ మొదటివారానికి దాదాపు 4 లక్షల కొత్త పీఎన్జీ కనెక్షన్లను యాక్టివేట్ చేసినట్టు తెలుస్తోంది. మామూలుగా అయితే 14.2 కేజీల గ్యాస్ సిలెండర్‌ను గృహ వినియోగదారులు వాడుతున్నారు. ఇప్పటికీ హైదరాబాద్ సిటీలో గ్యాస్ సిలెండర్లు బుక్ చేసున్నవారికి కష్టాలు తీరలేదు.

 

గ్యాస్ బుకింగ్ నెంబర్ ఫోన్ చేసి ఓ నెంబర్ పంపడానికి నాలుగైదు రోజులు తీసుకుంటుందని అంటున్నారు. ఒకవేళ వినియోగదారులు సదరు గ్యాస్ ఏజెన్సీలకు ఫోన్ చేస్తే మరో రెండువారాలు పట్టవచ్చని చెబుతున్నాయి. ఆ లెక్కన గ్యాస్ సిలెండర్ వచ్చేసరికి 40 నుంచి 45 రోజులు పడుతుందని అంటున్నారు. గ్యాస్ సిలెండర్ డిలే వల్ల పెద్ద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *