గడ్డి మందు తాగి వృద్ధుడి ఆత్మహత్య.

తేది:12-04-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.

జగిత్యాల జిల్లా: మల్యాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన వృద్ధుడు మల్యాల భూమయ్య (62) గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. మద్యానికి బానిసై ఇంటి వద్దనే ఉంటున్న వృద్ధుడు అనారోగ్య సమస్యలు తోడు కావడంతో శనివారం గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆయన కూతురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *